‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్

455
mister and miss
- Advertisement -

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది.

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ:” ఇది ఈ జనరేషన్ ప్రేమ కథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలెట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఈ కథ లో ఈ జంట లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ మూవీ లుక్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

- Advertisement -