భగీరథ నీళ్లే సురక్షితం- మంత్రి జగదీష్ రెడ్డి

425
Minister Jagadish
- Advertisement -

మిషన్ భగీరథ నీళ్లే శ్రేయస్కరం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ నది జలాలను నేరుగా ప్రజల చెంతకు భగీరథ రూపంలో పంపిస్తున్నారని ఆయన అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్ నీళ్లు కానీ బోర్ నుండి ఫిల్టర్ కాబడిన నీళ్లు కానీ ఎంత మాత్రం శ్రేయోస్కారం కాదని ఆయన తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం సూర్యపేట మున్సిపల్ పాలక వర్గంతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,వైస్ ఛైర్మన్ పుట్టా కిశోర్, ఓ ఎస్ డి వేణుగోపాల్ రెడ్డి కమిషనర్ రామాంజల్ రెడ్డి తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మతో పాటు వార్డు కౌన్సిలర్లు కరోనా కట్టడి అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఏకగ్రీవంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయా కౌన్సిలర్లు మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడుతూ తమ తమ ప్రాంతలలో వాటర్ ప్లాంట్ లను ఓపెన్ చేయాలన్న అంశం చర్చకు రాగా మంత్రి జగదీష్ రెడ్డి పై విధంగా స్పందించారు.

అదే సమయంలో కరోనా వైరస్‌పై ఆయన మాట్లాడుతూ..రాజకీయాలకు అతీతంగా పోరాడడం వల్లనే ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యగలిగామన్నారు.ఇందులో మున్సిపల్ కార్మికుల శ్రమ దాగి వుందని ఆయన కొనియాడారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ తో సహా కౌన్సిలర్లు మొత్తానికి మొత్తంగా ఎవరికి వారు ఎక్కడికక్కడ తీసుకున్న చర్యలు కూడా ప్రజల్లో మనో ధైర్యాన్ని పెంపొందించాయన్నారు. వాస్తవానికి సూర్యాపేటలో శాంపిల్ అధిక మొత్తంలో సేకరించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లు చూపిస్తుందని.. మునుముందు ఎటువంటి ప్రమాదం ఉండొ ద్దన్న కోణంలో నే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

నిజానికి మార్చి 29 వరకు సింగిల్ కేసు నమోదు కాలేదు అన్నారు. ప్రభుత్వం 29 న మర్కజ్ కు పోయిన వారిలో స్థానికులు 11 మంది ఉన్నట్లు ప్రకటించారని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. అయితే వారిలో ఏ ఒక్కరికి పాజిటివ్ గా తేలలేదన్నారు. ఆ క్రమంలోనే జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు నేపథ్యంలో మినహాయింపు లు యిచ్చిన మెడికల్ షాప్ నుండి.. కూరగాయల మార్కెట్ నుండే వైరస్ విస్తరించడం దురదృష్టకరమన్నారు. నిజానికి కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలోనే మొత్తం రాష్ట్రంలో నే మొట్టమొదటి సారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మార్కెట్ల వికేంద్రీకరణ జరిగిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. అయినప్పటికీ సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో ఏ ఒక్కరికి అసౌకర్యం కలుగ కుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రెడ్ జోన్ తో పాటు కంటైన్మెంట్ జోన్ పరిధిలోని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.

- Advertisement -