ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అందరిది..

644
- Advertisement -

హకీమ్ పేట్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో వనబోజన కార్యక్రమం నిర్వహించారు.ఈ వనబోజన కార్యక్రమానికి మంత్రులు పువ్వడా అజయ్ కుమార్, మల్లారెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఆర్టీసీ కార్మికులతో వనబోజనాలు చేశారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సువర్ణ యుగంలో అడుగేడుతోంది. నిత్యం వేల మందిని గమ్యాలకు చేరుస్తోంది అన్నారు.

ఆర్టీసీ మహిళ ఉద్యోగులకు కేవలం పగటి పూట డ్యూటీ నిర్ణయం అభినందనీయం. ఉద్యోగ భద్రత విషయంలో టికెట్ తీసుకొని ప్రయాణీకున్నే బదితున్ని చేసేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కోసం బయో టాయిలెట్స్ సౌకర్యం తీసుకొచ్చాం. అంతేకాదు 800 సర్వీసులతో కార్గో సర్వీసులు తీసుకొస్తున్నామని మంత్రి అన్నారు.

mallareddy

ఇక రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మంచి రోజులు సిసిఏస్ బకాయిలపై తొందరలోనే మంచి నిర్ణయం వింటారు. ప్రతి డిపోని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై పై ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగి బోనస్ తీసుకునే విధంగా లాభాల బాటలో పనిచేయాలి. కొందరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టాలి. అన్నారు మంత్రి పువ్వాడ.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ నెంబర్ 1 కాబోతోంది. 54 రోజులు ఉద్యమం చేశారు మాకు కూడా చాలా బాధ కలిగింది. ఆర్టీసీ కార్మికుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అండగా వున్నారు. ఆర్టీసీని సంవత్సరంలో లాభాల బాటలో తేవాలి. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

- Advertisement -