ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు..

260
ministers
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ,ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డ్స్,మఖ్దుము అవార్డ్స్, లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డ్స్,పేరిట బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,హోంమంత్రి మహమూద్ అలీ హాజరైయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మైన్ మహమ్మద్ రహిముద్దీన్ అన్సారీ,ప్రభుత్వ సలహాదారు ఏ.కె. ఖాన్ ఇతర సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం,ముస్లింల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విదంగా ఉర్దూని అభివృద్ధి చేయడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఉర్దూని రెండో భాషగా గుర్తించడం జరిగింది.

ముస్లిం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం మైనార్టీ స్కూల్స్ ఏర్పాటు చేసి అందులో ఉర్దూకి మొదటి ప్రధాన్యత ఇచ్చి ముస్లిం సమాజాన్ని గౌరవించుకుంటున్నామన్నారు.దేశంలో మత సామరస్యం పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాడిన వాళ్లలో ప్రముఖంగా నిలిచారు. వారి ఆశయాలు ,లక్ష్యాలు ఈనాటి ప్రభుత్వాలు ముందుకు తీసుకు వెళ్ళాలి. అన్ని రంగాల ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కొప్పుల మంత్రి ఈశ్వర్‌ అన్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. భారతదేశం గంగా జమున తహజీబ్‌లా హిందు,ముస్లిం సోదర భావంతో కలిసి మెలసి జీవించాలని కలలు కన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కన్న కలల్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఉర్దూ భాషకు అత్యధిక ప్రాధన్యం ఇస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ఉర్దూ ట్రాన్సలేటర్‌ని నియమించాలని చెప్పారు.

ఇంతకు ముందు ఏ సీఎం కూడా ముస్లిం సలహాదారులని నియమించలేదు. ప్రభుత్వ సలహాదారుగా ఏ.కె.ఖాన్ ని నియమించి ముస్లిం సమాజానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. భారత దేశంలో ముస్లింల అభివృద్ధి గురించి ఆలోచించే ఏకైక నేత సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హిందు ముస్లింలు సోదర భావంతో జీవిస్తున్నారు అని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.

- Advertisement -