రైతుమిత్ర యాప్‌ను ప్రారంభించిన మంత్రులు

321
Rythumitra App
- Advertisement -

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుమిత్ర యాప్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేటలో రైతులకు కీలక సమాచారం కోసం రైతుమిత్ర యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా 18 రకాల సలహాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సాంకేతిక సాగు సలహాలను సమయానుకూలంగా అందించడం, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, సూచనలను వ్యవసాయ అధికారులు తెలియజేస్తారని మంత్రి తెలిపారు. ఏఈవోలు కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. అధిక ఆదాయం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.

వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్ర బిందువని అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి తెలిపారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రైతు సమన్వయ సమితి ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుందామని మంత్రి రైతులను ఉద్దేశించి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -