కేఆర్ ఆమోస్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం..

555
ktr
- Advertisement -

తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీ రామారావు తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆమోస్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారని అన్నారు.

KR Amours death

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని ఆయన మృతి తెలంగాణకి తీరని లోటన్నారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అలాగే కేఆర్ ఆమోస్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరవలేనిదని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని నిరంజన్ రెడ్డి అన్నారు.

కేఆర్ ఆమోస్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి ఈటెల రాజేందర్.. ఆమోస్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -