రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది..

579
minister prashant reddy
- Advertisement -

నిజామాబాద్‌లో ఇవాళ ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ బినోలా వద్ద ప్యాకేజ్ 20 పనుల టన్నెల్ ప్రారంభ పాయింట్‌ను చాపర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇందులో భాగంగా సారంగపూర్ వద్ద నిర్మిస్తున్న ప్యాకేజ్ 20 పంపు హౌస్ పనులు, టన్నెల్, నిజాం సాగర్ కేనాల్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్యాకేజి 20,21,22 పనులను పరిశీలించడం జరిగింది. కాళేశ్వరం నుంచి 200 కిలో మీటర్ల రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీకి పునరుజ్జివన పథకం సక్సెస్ అయ్యింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో ప్యాకేజి 20,21 కు నీరు అందుతుందని మంత్రి అన్నారు. ఏరియల్ సర్వే ద్వారా సీఎంఓ స్మిత సబర్వాల్ ప్యాకేజి 21 పనులను పరిశీలించారు.

త్వరలోనే 3 ప్యాకేజీల పనులు పూర్తవుతాయి. ప్యాకేజి 21 కింద జిల్లాలో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ప్యాకేజీ 20, 21, 22 కింద జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. జూన్ వరకు 21 ప్యాకేజి ఫస్ట్ పేజ్ పనులు పూర్తవుతాయి. పైప్ లైన్ పనులకు రైతులు సహకరించాలి. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. సిఎంవో స్మిత సబర్వాల్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకొచ్చాం, పరిష్కరిస్తామని చెప్పారు అని మంత్రి పేర్కొన్నారు.

Telangana Minister Vemula Prashanth Reddy Visits SRSP Canal In Nizamabad..Telangana Minister Vemula Prashanth Reddy Visits SRSP Canal In Nizamabad..

- Advertisement -