సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: మంత్రి వేముల

231
vemula prashanth reddy
- Advertisement -

కరోనా విపత్తు వేళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 77 మంది వైద్య సిబ్బందికి ఫారెన్ సర్వీస్ డిప్యూటేషన్ (ఎఫ్‌ఎస్‌డీ) గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. వీరంతా వివిధ ప్రాంతాలకు వెళ్ల వలిసి ఉంది. కానీ ఈ కష్ట సమయంలో జీజీహెచ్‌లోనే వీరి సేవలు కొనసాగాలని, ప్రజలకు మెరుగైన మరింత వైద్యం అందాలన్న సంకల్పంతో ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ విషయాన్ని విన్నవించాను.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో 77 మంది వైద్య ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే సేవల్లో ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని సీఎం గారి ముందుంచాను. ఐదేండ్ల కాలపరిమితి ముగిసిన వీరికి మళ్లీ ఇక్కడే కొనసాగించడం కష్టతరమైన విషయం అయినప్పటికీ సీఎం గారు ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా, నా ప్రత్యేక విన్నపాన్ని మన్నించి నిబంధనలు సవరించి ఒక ప్రత్యేక జీవో రూపంలో వీరిని ఏడాది పాటు ఇక్కడే జిల్లా కేంద్రాస్పత్రిలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి గారికి నా తరపున, జిల్లా యంత్రాంగం, ప్రజలు, వైద్య ఉద్యోగుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 77 మందిలో 30 మంది సా్‌‌టప్ నర్సులు, ఐదుగురు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (ఎంపీహెచ్‌ఏ), 12 మంది పారా మెడికల్ సిబ్బంది, నలుగురు ఆఫీస్ స్టాప్, 26 మంది క్లాస్‌ఫోర్ విభాగం సిబ్బంది ఉన్నారు. వీరంతా నేటి నుంచి ఏడాది పాటు ఇక్కడే వైద్య సేవలు అందించనున్నారు. దీని ద్వారా పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయం కొనసాగనుంది. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రజలకు అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

- Advertisement -