సొంత నిధులతో నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణి చేసిన మంత్రి త‌ల‌సాని

260
talasani
- Advertisement -

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వ‌లస కూలీలు హైద‌రాబాద్ లోనే ఉండిపోయారు. వారంద‌ర‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకుంటుంది. ఒక్కొక్క‌రికి 12కేజీల బియ్యంతో పాటు రూ.500 ఇస్తున్నారు. తాజాగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న సొంత నిధుల‌తో పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిని చేశారు.

హైద‌రాబాద్ లోని బ‌న్సీలాల్ పేట‌లోని మ‌ల్టీ ఫ‌ర్ప‌స్ ఫంక్ష‌న్ హాల్ లో స‌రుకుల‌ను ఉంచారు. ఈ స‌రుకుల‌ను క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి, జీహెచ్ ఎంసీ క‌లెక్ట‌ర్ లోకేష్ కుమార్, పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ల‌కు అంద‌జేశారు. వివిధ ప్రాంతాల నుంచి హైద‌రాబాద్ కు ఉపాధి కోసం వ‌ల‌స వ‌చ్చిన పేద‌ల‌కు 20రోజుల‌కు స‌రిప‌డ స‌రుకుల‌ను అంద‌జేశారు.

- Advertisement -