జనతా ఖర్ఫ్యూ.. మనవడితో మంత్రి తలసాని కాలక్షేపం..

248
talasani

కరోనా వ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన జనతా ఖర్ఫ్యూ లో భాగంగా తన నివాసంలో తన మనవడు తారక్,కుమారుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాలక్షేపం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా ఖర్ఫ్యూ లో భాగంగా తమ ఇండ్లలో ఉండి స్వయం నియంత్రణ పాటించాలని కోరారు.ప్రభుత్వం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుందని.. అయినప్పట్టికి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన తెలిపారు.