చేనేత కార్మికులకు అండగా ఉంటాం-శ్రీనివాస్ గౌడ్

367
minister srinivas goud
- Advertisement -

మహబూబ్ నగర్, జోగులాంబ-గద్వాల జిల్లాలలోని మహబూబ్ నగర్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో పర్యాటకాభివృద్ధిపై స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం కలసి పర్యాటక శాఖ అధికారులతో సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికీ చేయూత నిచ్చేందుకు ఇప్పటికే బతుకమ్మ చీరల తయారీకి చేయూతనందిస్తూ, చేనేత కార్మికులకు అండగా, ఉపాధిని కల్పిస్తూ ప్రోత్సహించడాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఆదర్శంగా తీసుకొని, ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాల చేనేత వస్త్రాలను చేనేత కార్మికులు అమ్ముకునేందుకు అలంపూర్ లోని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హరిత హోటల్ ప్రాంగణంలో కొత్తగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆలంపూర్‌లో ఉన్న పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్‌ను మరింతగా అభివృద్ధి చేయాలని, అంతేకాకుండా అదనపు గదులతో విస్తరణ చేపట్టాలని మంత్రి అధికారులను కోరారు. అంతేగాకుండా జమ్ములమ్మ దేవాలయానికి వస్తున్న భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు అవసరమైన మౌళిక వసతులు, షెడ్ ల నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అలంపూర్, జమ్ములమ్మ చెరువు, మన్నెంకొండ లాంటి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక శాఖకు పంపిన ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు కొరకై పంపిన ప్రతిపాదనలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో కోడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ దినకర్ బాబు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -