గోల్కొండ నోట్ బుక్స్ డైరీని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

323
- Advertisement -

బషీర్ బాగ్‌లోని చక్కర భవన్‌లో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ రిటైల్ అవుట్‌లెట్‌ను అలాగే డైరీ ఆవిష్కరణలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎక్సైజ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ వి శ్రీనివాస్ గౌడ్ , చైర్మన్ దేవరి మల్లప్పా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోల్కొండ నోట్ బుక్స్ రిటైల్ కౌంటర్ అండ్ డైరీని ఆవిష్కరించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది లేపాక్షి నోట్ బుక్స్ అనే పేరుతో బుక్స్ తయారు చేసి ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నంది లేపాక్షి నోట్ బుక్స్ పేరును గోల్కొండ నోట్ బుక్స్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మార్చడం జరిగింది. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ హాస్టల్స్ స్కూల్ కు, గురుకుల విద్యలయాలకు , ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకునే విద్యార్థులకు సరఫరా చేయటం సంతోషంగా ఉందన్నారు.

Minister Srinivas Goud

ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన నోట్ పుస్తకాలు, తక్కువ ధరలకే అందించటం ద్వారా మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయజనకరంగా ఉంటుందన్నారు.ఈ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన నోట్ బుక్ లను ను ప్రింట్ చేయించి ప్రభుత్వ పాఠశాలలకు హాస్టల్ కు పంపిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు చైర్మన్ దేవరి మల్లప్పా ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Mahamood Ali

హోంమంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కృషితో ఈ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ అవుతుంది.ఈ నోట్ బుక్స్ తక్కువ ధరతో ఎక్కువ నాణ్యత కలిగిన ఉన్నాయి.

చైర్మన్ దేవరి మల్లప్ప మాట్లాడుతూ.. దీని ద్వారా వాణిజ్య సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇప్పటివరకు నోటు బుక్స్ సప్లై చేశాం. ప్రైవేటు రంగాల కూడా నోట్ బుక్స్ పంపిస్తామన్నారు.

- Advertisement -