మాజీ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి

81
gattubheemudu

గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గట్టు భీముడు మృతికి సంతాపం ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.