ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలను ఇబ్బందిపెట్టారుః మంత్రి సత్యవతి

203
Satyavathi Rathod

దసరా, బతుకమ్మ పండుగ ముందు సమ్మె చేసి ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్నారు మంత్రి సత్యవతి రాధోడ్. హుజుర్ నగర్ ఉప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మట్టంపల్లి మండలంలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. RTC సమ్మె పై ప్రతిపక్ష పార్టీలు అర్ధరహితంగా మాట్లాడుతున్నాయన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత 44 % ఫిట్ మెంట్ ఇచ్చి సీఎం కేసీఆర్ గారు RTC ఉద్యోగుల ను గౌరవించారు.RTC నాయకుల వ్యవహార తీరు వల్ల మరింత నష్టాల్లో సంస్థ కూరుకుపోయింది. RTC ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ఎక్కడ చెప్పలేదన్నారు. స్వార్ధ రాజకీయ నాయకుల ఉచ్చులో పడి RTC కార్మికులు నష్టపోతున్నారు.కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర లాల్లో RTC ని ప్రభుత్వం లో ఎందుకు విలీనం చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు