కార్పొరేట్ స్థాయికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

614
minister satyavathi
- Advertisement -

తెలంగాణలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతామన్నారు రాష్ట్ర గిరిజన, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. మహేశ్వరం నియోజకవర్గంలోని ఉప్పుగడ్డ తండాలో గిరిజన గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాల పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు సత్యవతి రాధోడ్, సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. గిరిజన తాండల ను గ్రామ పంచాయితీ లు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాండలకు 20 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గిరజనుల అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు. ఆర్ టి సి కార్మికుల సంక్షేమం ముఖ్యమంత్రి తో నే సాధ్యం. సింగరేణికి దీటుగా ఆర్ టి సి ని తీర్చిదిద్దటానికి సీఎం కృషి చేస్తారన్నారు.

మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల ద్వారా ఒక్కో విద్యార్థి కీ లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 18 నెలల్లో భవనం పూర్తి చేస్తామన్నారు. రెండున్నర కోట్ల రూపాయల తో నిర్మించే సేవాలాల్ బంజారా భవన్ కు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.

- Advertisement -