మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..

53

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మంచి మనస్సును చాటుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ మార్గ మధ్యలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద లారీ బైక్‌ను ఢీకొని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మం నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ఆయన జరిగిన సంఘటనను చూసి వెంటనే తన వాహనం ఆపి ప్రమాదంలో గాయపడిన వారితో అక్కడే మాట్లాడి వారిని వెంటనే తన పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో చికిత్స కోసం తరలించారు. అంతేకాదు మంత్రి మమత హాస్పటల్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Minister Puvvada Ajay Kumar

Minister Puvvada Ajay Kumar