ఆ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా చేస్తాం- మంత్రి

354
hema

మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి పీసీ శర్మ హేమామాలిని బుగ్గల్ని ఉద్దేశిస్తూ… కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ రాష్ట్రంలోని రోడ్లను బీజేపీ ఎంసీ హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తానన్నారు. ప్రజాపనుల మంత్రి సజ్జన్‌ వర్మతో కలిసి శర్మ రహదారుల పరిస్థితిని సమీక్షిస్తూ..

మధ్యప్రదేశ్‌లో రోడ్లు బీజేపీ నేత కైలాష్‌ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయని వాటికి ప్లాస్టిక్‌ సర్జరీ అవసరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశాల మేర 15 రోజుల్లో రోడ్లకు మరమ్మతులు చేసి ఎంపీ హేమమాలిని బుగ్గల్లా తయారు చేస్తామని మంత్రి శర్మ మీడియాతో చెప్పారు.

hema-malini

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవ గత వారం రాష్ట్రంలో రోడ్ల స్థితిగతుల పరిస్థితిపై కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని విమర్శించిన తరువాత శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.