కొండా లక్ష్మణ్‌ బాపూజీ యూనివర్సిటీ దేశానికే తలమానికం..

258
Minister Niranjan reddy
- Advertisement -

సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ,గజ్వెల్ లోని ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ను ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతిష్టాత్మక కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుపట్టి ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయించారు. ఈ యూనివర్సిటీ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాక మొత్తం దేశానికే తలమానికం లాంటిది. ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో పండ్ల పరిశోధనకు కేంద్రం కాబోతుంది. ఇలాంటి యూనివర్సిటీలు దేశంలో 4 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులు గొప్ప విద్యను అభ్యసించబోతున్నారు.. పరిశోధనలు చేయబోతున్నారని మంత్రి అన్నారు.

పండ్ల తోటలకు,కూరగాయల పంటల సాగుకు సిద్ధిపేట జిల్లా హబ్‌గా ఉంది.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన యూనివర్సిటీని..అప్పటి పాలకులు ఆంధ్రా ప్రాంతానికి తరలించుకు వెళ్లారు. ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టే ఆయన వవ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారు.

Telangana State Agriculture Minister Niranjan reddy visits Sri Konda Laxman Bapuji Horticultural University..

- Advertisement -