కాళేశ్వ‌రంతో తెలంగాణ‌లో కొత్త‌ శ‌కం…మంత్రి నిరంజన్ రెడ్డి

234
Minister Niranjan Reddy
- Advertisement -

రేపు కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభోత్స‌వం సంధ‌ర్భంగా రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి మీడియతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ ప్రాధామ్యాల‌లో నీళ్లే మొద‌టివి.రాబోయే రోజుల‌లో తెలంగాణ స్వ‌రూప‌మే మారుతుంది.అశాంతి, అల‌జ‌డులు లేని తెలంగాణ‌ను చూడ‌బోతున్నాం.ప్ర‌జ‌లంతా ఎవ‌రి ప‌నుల‌లో వారు నిమ‌గ్న‌మ‌వుతారు.

భౌగోళికంగా, సామాజికంగా స‌మూల మార్పులు.తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన‌, రాష్ట్రం ఏర్ప‌డిన‌ నాటి సంతోషం మ‌ళ్లీ కాళేశ్వ‌రం ప్రారంభంతో క‌లుగుతుంది.కాళేశ్వ‌రం పూర్తికావడంతో పాల‌మూరు ప్రాజెక్టుల‌పై దృష్టి పెడతాం. కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.కాళేశ్వ‌రం నిర్మాణంలో శ్ర‌మించిన వారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.

తెలంగాణ ఉద్య‌మం మొద‌ల‌యిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల మీద‌. అందులో మొద‌టి ప్రాధాన్యం నీళ్ల‌ది. ప్రాజెక్టులు అంటే పెండింగ్. ద‌శాబ్దాల‌పాటు సాగ‌దీత అనే నిర్ల‌క్ష్యాన్ని చెరిపేసి కేవ‌లం ప్రారంభించిన మూడేళ్ల‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కం కాళేశ్వ‌రాన్ని పూర్తిచేసిన ఘ‌న‌త కేసీఆర్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వానిది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభంతో తెలంగాణ‌లో కొత్త‌శ‌కం ప్రారంభ‌మ‌వుతుంది. తెలంగాణ ముఖ‌చిత్రం స‌మూలంగా మార‌బోతుంద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

- Advertisement -