పచ్చదనం పెంచాలి- మంత్రి నిరంజన్ రెడ్డి

216
Agriculture Minister

పబ్లిక్ గార్డెన్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. అనంతరం ఉద్యాన శాఖ కమీషనర్ కార్యాలయంలో హార్టికల్చర్, సెరికల్చర్ శాఖలపై మంత్రి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో ఉద్యాన కమీషనర్ వెంకట్రాంరెడ్డి హాజరైయ్యారు. పబ్లిక్ గార్డెన్ లో పర్యటించి మంత్రి పచ్చదనం పెంచాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు.

Minister Niranjan Reddy

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంటల వారీగా రైతులను గుర్తించి గ్రూపులను (రైతు బృందాలు) ఏర్పాటు చేయండి.రైతులను చైతన్యపరిచి పంటలమార్పిడికి ప్రోత్సహించండి. ఆయిల్ పామ్ తోటల సాగు ఉదృతం చేయాలి. సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇవ్వండి. రాష్ట్రంలో నాణ్యమైన పండ్లతోటల సాగు పెరగాలి.అలాగే క్రాప్ కాలనీలలో కూరగాయల పంటల సాగు పెంచాలని మంత్రి తెలిపారు.

Niranjan Reddy

మల్బరీ సాగుతో రైతులు అధిక ఆదాయం అందుకోవచ్చు. అధిక ఆదాయం ఇచ్చే నూతన పంటలైన వెదురు, శ్రీ గంధం సాగు విస్తృతం కావాలి. 2021 వార్షిక ప్రణాళిక పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలి.పబ్లిక్ గార్డెన్ లో ప్రజలకు అహ్లాదం కలిగించేలా పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు నాటండి. అధిక ఆక్సిజన్ విడుదల చేసే వెదురు తరహా మొక్కలు అభివృద్ది చేయండి అని మంత్రి అధికారులను ఆదేశించారు.