బత్తాయి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..

408
minister niranjan reddy
- Advertisement -

రాష్ట్రంలో 47వేల ఎకరాల్లో బత్తాయి స్టాండింగ్ క్రాప్ ఉందని.. ఈ పంటను ఢిల్లీ, కలకత్తా లకు పంపవల్సి ఉంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో పంపలేని పరిస్థితి నెలకొందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. నేడు బత్తాయి మార్కెటింగ్‌పై ఎల్బీనగర్ రైతుబజార్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతుల కోరిక మేరకు…రాష్ట్రంలోని, దేశంలోని ట్రేడర్స్ ను భాగస్వాములను చేయలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

బత్తాయి ఆవశ్యకత గురించి సీఎం చెప్పడం వల్ల ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. బత్తాయి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వీటిపై మరింత అవగాహన కోసం…సెలెబ్రెటీలతో చెప్పించాలని అనుకుంటున్నామన్నారు. మార్కెటింగ్ శాఖ బత్తాయిలను హోం డెలివరీ కూడా చేస్తుంది అన్నారు మంత్రి. బత్తాయి లు పరిపక్వమ్ చెందకుండా స్ప్రే ఒకటి ఉంది. దానిని ఉపయోగిచాలనుకుంతున్నాం..ఇది ఆరోగ్యకరం అన్నారు.

మే3 వరకు లాక్ డౌన్ ఉంది. అప్పటి వరకు పంట చెట్టు మీద ఉంటే బావుంటదాని..స్ప్రే కొట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ట్రేడర్స్ కూడా లాభం ఆశించకుండా పని చేస్తాం అన్నారు. రక్షణ శాఖకు కూడా పంపించాలనే సూచన వచ్చింది. దీనిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

- Advertisement -