మంత్రి మల్లారెడ్డిపై అసత్య ప్రచారం..పోలీసులకు ఫిర్యాదు

152
minister mallareddy

సోషల్ మీడియా వేదికగా మంత్రి మల్లారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఓఎస్‌డీ సుధాకర్‌ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలు పోస్టు చేస్తున్నారంటూ కొంతమంది తన దృష్టికి తీసుకొచ్చారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు సుధాకర్ రెడ్డి.

మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డిపై కథనాలు, వీడియోలు అభ్యంతరకంగా ఉన్నాయని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్‌ అధికారులు ఐపీ అడ్రస్‌లను గుర్తించారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.సోషల్‌మీడియాలో ఎవరినైనా కించపరిచేలా, అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.