ఆర్టీసీ సమ్మెను బిజెపి-కాంగ్రెస్ వాడుకుంటున్నాయి..

431
minister mallareddy
- Advertisement -

గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి , సురేందర్ గౌడ్ లకు సంతాపం తెలిజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అడగకుండానే 44% ఫిట్ మెంట్ ఇచ్చి కార్మికులకు న్యాయం చేశారు సీఎం కేసీఆర్.అలాంటి మహనీయుడు అప్పీల్‌ను గౌవరించే వ్యక్తిత్వం లేని నాయకుల వల్లే సమ్మె జరుగుతుందని మంత్రి అన్నారు.

ఆర్టీసీ సమ్మెను బిజెపి, కాంగ్రెస్ లు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఆర్టీసీ కార్పొరేషన్లను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదు.? కారణం ఏంటి..? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులకు ఇస్తోన్న వేతనాలు ఎంత..? తెలంగాణా లో ఎంత..? అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

కూర్చున్న కొమ్మను నరికేసి కార్మికులకు అన్యాయం చేయాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వంగా కొనసాగుతున్నది.. ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంతటి ఔదార్యమైన పాలన మరెక్కడా లేదని మంత్రి తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా వ్యవస్థ కూడా మారుతోంది.ఆ పరిస్థితుల్లో లాభాల బాటన నడిపించాలంటే వినూత్న మార్గాలు అనుసరించక తప్పదు. విపక్షాల మాటలు, కొందరి నాయకుల మాటలు వింటే ఆర్టీసీ కార్మికులు నష్టపోతారు. రాజకీయ కుట్రలకు బలికావద్దు. నాయకులు కాదు కార్మికులే ఆలోచించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -