ప్రజలకు మరింత సేవ చేస్తాః కేటీఆర్

307
ktr Thanks To Kcr

నాపై నమ్మకం ఉంచి మరోసారి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి మంత్రిగా మరోసారి అవకాశం దొరికిందన్నారు. ఈసందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించన సిరిసిల్ల నియోజవకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. తనకు అభినందనలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి తనను కలవడానికి వచ్చే వారికి ఓ విన్నపం చేశారు కేటీఆర్. నా వద్దకు వచ్చేటపుడు బోకేలు, శాలువాలు తీసుకురావద్దని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినా, సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చినా ఎంతో సంతోషిస్తానని తెలిపారు.

కొత్త ఏర్పడిన మంత్రి వర్గంలో కేటీఆర్ కు కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖలను అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఇవే శాఖలకు మంత్రిగా పనిచేశారు.