మంత్రి కేటీఆర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్

428
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారన్న సంగతి తెలిసిందే. పలు విషయాలను పార్టీ కార్యకర్తలతో పంచుకుంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కేటీఆర్ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిక్షరిస్తారు. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటారు.

తాజాగా కేటీఆర్ తన అభిమానులతో మరో అనుభూతిని పంచుకున్నారు. తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు కేటీఆర్. కాగా, ఆ లైసెన్స్ ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా విభాగం జారీ చేసింది. 1998సంవత్సరంలో మంత్రి కేటీఆర్ కు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్లు ఆ ఫోటో ఉంది.

ktr

- Advertisement -