పారదర్శకమైన పురపాలన కోసమే కొత్త చట్టం

371
ktr
- Advertisement -

హైదరాబాద్ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జియచ్‌యంసి చట్టాన్ని మార్చనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో అమలులోకి తీసుకువచ్చిన నూతన పురపాలక చట్టంలోని అన్ని కీలకమైన అంశాలను జియచ్‌యంసి నూతన చట్టంలో పొందుపర్చనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చట్ట స్పూర్తిని, చట్టంలోని నిబందనలను యథాతధంగా జియచ్‌యంసి చట్టంలోనూ తీసుకురావాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు. ఈ మేరకు మార్చ్ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో నూతన జియచ్‌యంసి చట్టాన్ని అమోదం కోసం పంపుతామన్నారు. ఈ చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలపైన పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, కమీషనర్ లోకేష్ కూమార్ లకు పలు అదేశాలు జారీ చేశారు.

జియచ్‌యంసి చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, పౌరసేవల వేగవంతం, ప్రజా ప్రతినిధులపై భాద్యత పెంచడం, అధికారులు తమ విధులకు మరింత భాద్యత వహించేలా చూడడం వంటి కీలకమైన అంశాలను ఈ చట్టంలో పొందుపర్చాలని సూచించారు. నూతన పురపాలక చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో అనేక సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో వారికి మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందుతాయని తెలిపారు. ప్రస్తుత జియచ్‌యంసి చట్టాన్ని సమూలంగా మార్చేందుకు, నూతన పురపాలక చట్టంతో సమానంగా మార్పులు చేసేందుకు అవసరం అయిన ప్రక్రియను వేంటనే చేపట్టాలన్నారు. ముఖ్యంగా త్వరలో తీసుకురానున్న నూతన తెలంగాణ బిల్డింగ్ అనుమతుల ప్రక్రియ (టియస్ బిపాస్) నేపథ్యంలో అవసరం అయిన మార్పులను సైతం ఈ నూతన చట్టంలో ఉండాలన్నారు. దీంతోపాటు హెచ్ యండిఏ పరిధిలోని భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం అయ్యేలా చేస్తామన్నారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ రోజు జియచ్‌యంసి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పోరేషన్ కార్యక్రమాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జోనల్ స్థాయిలో ప్రతి కమీషనర్ మరింత చొరవగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న యస్సార్డిపి, రోడ్ల నిర్వహాణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి మౌళిక వసతుల కల్పన కార్యక్రమాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహాణ వంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. జోన్ల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ఏప్పటిక్పప్పుడు లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు పోవాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్ల నిర్మాణం, పార్కుల నిర్వహాణ, జంక్షన్ల అభివృద్ది, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇలాంటి వాటి కోసం ప్రత్యేక ఐటి డ్యాష్ బోర్డు ఎర్పాటు చేయాలని, దీని ద్వారా అయా కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జియచ్‌యంసి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు.

- Advertisement -