డీఎంకే అధినేత స్టాలిన్ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్

238
ktr
- Advertisement -

తెలంగాణ‌ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న పెద్ద‌మ‌న‌సు చాటు కున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌ధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ సంద‌ర్భంగా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స కూలీలు మ‌న రాష్ట్రంలోనే ఉండిపోయారు. త‌మిళ‌నాడుకు చెందిన ప‌లువురు చిరు వ్యాపారులు నిజామాబాద్ జిల్లా, బాల్కొండ, కిసాన్ నగర్ లో చిక్కుకున్నారు.

వారందరికీ ఆహారం, ఆశ్రయం లేదు. దయచేసి మీరు కల్పించుకోవాలని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. వారిని ఆదుకోవాల‌ని వారి వివ‌రాల కోసం తమిళనాడు స్మాల్ వెండర్స్ డెవలప్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాసమురుగేశన్ ను 7397585802 నంబర్ లో సంప్రదించవచ్చు” అంటూ తెలంగాణ సీఎంఓకు, కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. స్టాలిన్ సార్…వీ విల్ టేక్ కేర్..మా టీమ్ వారిని సంప్ర‌దిస్తుంది అని చెప్పారు. కేటీఆర్ చూపించిన ఔదార్యం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -