తెలంగాణ జాగృతి కృషి భేష్: కేటీఆర్

655
ktr
- Advertisement -

తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చారు మంత్రి కేటీఆర్. ఇందుకోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థను అంతా అభినందించాలన్నారు. ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసిన కేటీఆర్… పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగ, విడదీయలేని ఉద్యమరూపంగ మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు.

దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నరు. నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్ పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే, హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నారు.

సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేటీఆర్ సందేశాన్ని ఫేస్ బుక్‌,ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది తెలంగాణ జాగృతి సంస్థ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -