రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించింది

423
minister-ktr-illendu
- Advertisement -

రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎక్సైజ్‌ మినిస్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్‌, వనమా వెంకటేశ్వర్‌ రావు, రెడ్యానాయక్‌, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్‌ ఎం.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పగ్రతి కార్యక్రమం విజయవంతంకావడంతో పట్టణ ప్రగతిని ప్రారంభించారన్నారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ప్రభుత్వం.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గోని తమ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయకుండా.. మున్సిపల్‌ సిబ్బందికి అందజేయాలని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులంతా ప్రతి పల్లె, పట్టణాల్లో తిరుగుతూ.. పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలియజేశారు. పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -