రాజకీయాలకు అతీతంగా పట్టణాల అభివృద్ధి: కేటీఆర్

336
ktr
- Advertisement -

రాజకీయాలకు అతీతంగా పట్టణాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రగతి ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ …రాజకీయ పరమైన ఆపేక్ష లేకుండా పట్టణాలు అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ మానస పుత్రిక పట్టణ ప్రగతి అన్నారు. బస్తీ వాసులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం అని తెలిపిన కేటీఆర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశాం…మరో మార్కెట్ నిర్మాణానికి స్థలం కోసం సహకరిస్తాం అన్నారు. 13 చోట్ల పబ్లిక్ టాయిలెట్ ల నిర్మాణం చేపడుతున్నాం…ఓపెన్ జిమ్,చిల్డ్రన్ పార్క్ ప్రారంభించాం అన్నారు. మహాబుబ్ నగర్ పట్టణంలో 110 చెత్త సేకరణ ఆటో లను ప్రారంభించామని..స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక మైన జోన్ లు ఏర్పాటు చేసుకోబోతున్నాం అన్నారు.దళిత వాడ, గిరిజన వాడ ల నుండి పట్టణ ప్రగతి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.

పార్టీలకతీతంగా పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని…పట్టణ ప్రగతి లో ప్రజల భాగస్వామ్యం కీలకం అన్నారు. పౌర సేవలే కేంద్రంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని సీఎం కేసీఆర్ రూపొందించారని…మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని….పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు. పరిచయం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని..శానిటేషన్ సిబ్బంది తో కాలనీ వాసులకు పరిచయం కార్యక్రమం హైదరాబాద్ లో విజయవంతం అయిందన్నారు. మున్సిపాలిటీ బడ్జెట్ లో పది శాతం పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలన్నారు.

- Advertisement -