పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

260
TRS-PARTY

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటి సారి తెలంగాణ భవన్ కు రావడంతో కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో తెలంగాణ భవన్ పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా మారింది.

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నమస్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసి కాసేపు ముచ్చటించారు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఇంఛార్జ్ లు , సెక్రటరీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహలపై పార్టీ నేతలకు వివరిస్తున్నారు మంత్రి కేటీఆర్.