దేశంలోనే తొలి ఏసీ బ‌స్ స్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్…

206
minister ktr inagurated in no1ac bus station in india..which is located in hyderabd city..
- Advertisement -

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్నారు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. స‌రొకొత్త హంగుల‌తో భాగ్య‌న‌గ‌రాన్ని దేశంలోనే నెంబ‌ర్ సిటిగా తిర్చిదిద్దుతున్నారు. భాగ్య‌న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా మారుస్తూ… అభివృద్ది ప‌థంలో న‌గ‌రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ఐటి హ‌బ్ తో తెలంగాణ‌ను ప్ర‌పంచానికి ప‌ర‌చ‌యం చేసిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ లోని శిల్పారామం ఎదుట కొత్త‌గా జీహెచ్ ఎంసీ నిర్మించిన ఏసీ బ‌స్ స్టాప్ ను మంత్రి ప్రారంభించారు. దేశంలోనే తొలి ఏకైక ఏసీ బ‌స్ స్టాప్ ను మంత్రి కేటీఆర్ స్దాపించారు.minister ktr inagurated in no1ac bus station in india..which is located in hyderabd city..

అక్క‌డే ఉన్న ల‌గ్జ‌రీ వార్ రూం, లూ కేఫ్ ను మంత్రి ప్రారంభించారు. అంతేకాకుండా హైదారాబాద్ లోని శేరిలింగంప‌ల్లి, కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్ధాప‌న చేశారు మంత్రి కేటీఆర్. మాదాపూర్ అయ్య‌ప్ప సోసైటీ వ‌ద్ద జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో నిర్మించిన రిజ‌ర్వాయ‌ర్ ను మంత్రి ప్రారంభించారు. ఇలా ప‌లు అభివృద్ది ప‌థ‌కాల‌తో దేశంలోనే నెంబ‌ర్ రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇక దేశంలోనే తొలి ఏకైక ఏసీ బ‌స్టాప్ ను ఏర్పాటు చేసి అరుదైన ఘ‌న‌త సాధించింది జీహెచ్ ఎంసీ. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ప‌లువురు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గోన్నారు.

- Advertisement -