ఏరో స్పెస్ యూనివర్సిటీ ఏర్పాటు కు కృషి చేస్తాం

382
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ భాగస్వామ్యం తో ఏరో స్పెస్ యూనివర్సిటీ ఏర్పాటు కు కృషి చేస్తామని చెప్పారు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీ లోని ట్రిడెంట్ హోటల్ లో సిఐఐ ఆధ్వర్యంలో డిఫెన్స్ కాంక్లేవ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర CII చైర్మన్ రాజు , వైస్ చైర్మన్ CII క్రిష్ణ బడనపు , కో కన్వీనర్ CII డిఫెన్స్ & ఏరో స్పెస్ ప్యానెల్ చైర్మన్ అశోక్ అట్లూరు తదితరులు పాల్గొన్నారు

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం డిఫెన్స్ కు అనుకూలంగా ఉంది..కానీ కేంద్రప్రభుత్వం వాళ్ల రాజకీయాల అవసరాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిస్తుందన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని కోరినం..కానీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. డిఫెన్స్, ఎయిరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ లోని బాలానగర్, కుషాయిగూడలో ఎయిరోస్పేస్, డిఫెన్స్ విడిభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్- బెంగుళూరు రూట్ లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడామని తెలిపారు.

- Advertisement -