హుజుర్‌గర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..

539
jagadish-reddy
- Advertisement -

హుజుర్‌గర్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నందున నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభాస్థలి,బహిరంగ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు పరిశీలించారు. నియోజకవర్గ ఉప ఎన్నికల ఇంచార్జ్ మండలిలో విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దీపికా యుగందర్ రావు, శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

minister jagadesh reddy

 

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. హుజుర్‌గర్ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను చూసి ఆయన చెప్పే మాటలు వినేందుకు ఇక్కడి ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎప్పుడూ చూడలన్నదే ఇక్కడి ప్రజల ఆకాంక్ష. ఈ ఉప ఎన్నికలలో గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని జగదీష్‌ రెడ్డి తెలిపారు.

శానంపూడి సైదిరెడ్డి గెలుపుతోటే హుజుర్‌గర్ అభివృద్ధి అన్నది ప్రజలు గుర్తించారు. పద్మావతికి ఓటు ఉత్తమ్ కుటుంబానికి ప్రయోజనం అన్నది తేలిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కు అభివృద్ధి గుర్తుకు రాలేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆయన పార్టీనే. మరి అప్పుడే అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉండవు కదా. అని మంత్రి అన్నారు.

- Advertisement -