తొలి ప్రాధాన్యత రైతులకేః మంత్రి జగదీశ్వర్ రెడ్డి

399
Minister jagadishwar Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రాధాన్యత రైతులకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే తగిన కార్యాచరణ రూపొందించుకున్నారన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మిర్యాలగూడ లో ని అవంతి పురం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… 
మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ గా నియమితo కాబడిన చైర్మన్, వైస్ చైర్మన్ పాలక వర్గం కు శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలక వర్గం సరైన సేవ చేస్తుందని ఆశిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

రాష్ట్రం రాకముందు గత పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రం కుదేలు అయిందన్నారు. వ్యసాయానికి సీఎం కేసీఆర్ ప్రాణం పోశారన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలన ఉండాలన్నారు. రైతును రాజు చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం రైతులకు మేలు చేసే పథకాలు తీసుకువస్తూనే ఉంటుందన్నారు.

ఎమ్మెల్సీ  గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణ రైతు ను రాజు చేయాలనే లక్ష్యం గా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. మరో వారం రోజుల్లో రైతు ల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు. రైతులను, వ్యాపారులను సమన్వయం చేస్తూ నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం తమ పాలన ను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, నూతన మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పలువురు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -