సీఎం కేసీఆర్ లేకుంటే కాళేశ్వరమే లేదు

227
Minister Jagadishwar Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే కాళేశ్వరమే ఉండి ఉండేది కాదన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి .సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువు లో గోదావరి నీళ్లు మత్తడి దూకిన సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలకు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుంటే సూర్యపేట జిల్లా ప్రజలు వెయ్యి ఏండ్లు నిండినా గోదావరి జలాలను చూసి ఉండేవారం కాదని అన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరి ఈ రోజు ఊరంతా పండుగ జరుపుకున్నామంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలమే నన్నారు. చివరి ఇంచు వరకు గోదావరి జలాలు అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని శతబ్దాల నిరీక్షణ అనంతరం రావిచెరువు గోదావరి నీటితో మత్తడి దూకిందన్న సంతోషం తో తెలంగాణ రైతు కండ్లలో కనిపించే ఆనందమే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నదని,అది యిలా నేరవేరినందుకు సంతోషం పట్టపగ్గాలు లేకుండా పోయిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు .

 jaggu