శ్రీశైల మల్లన్న సన్నిధిలో మంత్రి జగదీష్‌ రెడ్డి..

106
jagadish reddy visit Srisailam

ఈ రోజు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈగలపెంట అతిధి గృహం చేరుకున్న మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సందర్శించి విద్యుత్ ఉత్పత్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

minister jagadish reddy

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీశైలం ఆలయం చేరుకున్నారు ఆలయ రాజగోపురం ముందు అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. కార్తీకమాసం సోమవారం కావటంతో ఆలయంలోని ఉసిరిచెట్టు కింద కుటుంబ సభ్యులతో కలసి కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు.

jagadish reddy

ఆలయంలోని ద్వజస్దంభం దర్శనం చేసుకుని శ్రీశైల బ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని లక్ష దీపోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు తిరిగి ఈగలపెంట అతిధి గృహానికి చేరుకున్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.