ప్రతీ ఒక్కరు సహాయం అందించాలి- మంత్రి జగదీశ్ రెడ్డి

328
- Advertisement -

కరోనా బాధితుల వైద్యం కొరకు సూర్యపేట క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి పలువురు సీఎం సహాయ నిధి చెక్ లను అందజేశారు. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభువ్త్వానికి అండగా ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు సూర్యపేట ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలకు పలువరు తమ వంతు సాయం అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద విరాళాలు ప్రకటిస్తున్నారు.

Jagadish Reddy

ఈ మేరకు సూర్యపేట క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి పలువురు చెక్ లను అందజేశారు. అందజేసిన వారిలో తెలంగాణ అర్చక సమాఖ్య సూర్యపేట జిల్లా అధ్యక్షులు, శివాలయం ప్రధాన అర్చకులు వలివేటి వీర భద్ర శర్మ 51 వేలు, సూర్యాపేట వైస్ చైర్మన్ కూతురు పుట్టా ఖ్యాతి తన కిడ్డి బ్యాంక్ లోని 22 వేలు, రిటైర్డ్ ఉద్యోగి పోరెడ్డి శంకర్ రెడ్డి 18 వేలు, టి.ఆర్.ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ వై.ఎల్.ఎన్ గౌడ్ 10 వేల రూపాయల చెక్ లను మంత్రికి అందజేశారు.

Jagadish Reddy 1

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోందని, ఈ సమయంలో పేద ప్రజలకు అండగా నిలవటం ఎంతో అవసరమని అన్నారు. ప్రతీ ఒక్కరు తమకు తోచిన విధంగా సహాయం అందించి.. పేద ప్రజల వైద్యంకు సహకరించాలని కోరారు. స్వచ్ఛందంగా సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisement -