ప్లాస్టిక్ వాడి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు:హరీష్ రావు

477
harishrao
- Advertisement -

ప్లాస్టిక్ వాడి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. సిద్దిపేట లో చెత్త బండి ఎలా వచ్చిందో దుబ్బాక లో కూడా ఇంటింటికి అలాగే వస్తది.. దుబ్బాక లో మూడు కోట్ల రూపాయలతో డంపు యార్డు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇంటికి రెండు బుట్టలు ఇస్తున్నాం పొడి చెత్త ఒక బుట్టలో, తడి చెత్త ఒక బుట్టలో వేయాలన్నారు. గతంలో దుబ్బాకకు చెత్త స్వాగతం పలికేది.. ఇప్పుడు అలా లేదన్నారు. ప్లాస్టిక్ ఎవ్వరూ వాడద్దన్నారు. పది కోట్లతో నిర్మించిన ముఖ్యమంత్రి కెసిఆర్ చదివిన స్కూల్ కొద్ది రోజులలో ప్రారంభం కానుందన్నారు.

రెండు వేల పెన్షన్ ఇవ్వడం వలన పిల్లలపై తల్లిదండ్రులు ఆధారపడకుండా ఉంటుందన్నారు. దుబ్బాకలో వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎలాంటి రెకమండేశన్ ఉండదు…. త్వరలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతాం అన్నారు. ఇంటికి ఐదు చెట్లు పెట్టండి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.

తనకు దుబ్బాక, సిద్దిపేట రెండు కళ్ల లాంటివి. సిద్దిపేట ఎలా ఉందో దుబ్బాక ను అలాగే తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి, బిడ్డ పుడితె కెసిఆర్ కిట్టుతో పాటు పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాం అన్నారు.

- Advertisement -