ప్రతి ఆదివారం గ్రామాన్ని శుభ్రం చేయాలిఃమంత్రి హరీష్ రావు

218

గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి ఆదివారం గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. గ్రామ స్వచ్చత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపిట్టిన ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా గజ్వేల్ మండలంలోని కొలుగూర్ గ్రామంలో పర్యటించారు హరీష్‌ రావు. ఈసందర్భంగా గ్రామ ప్రజలు మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలుగూర్ గ్రామాన్ని దత్తత తీసుకోమని మీరు నన్ను కోరారు..మీ కోరిక మేరకు నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు.

Harish Rao Vilage

అందుకే మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మీ గ్రామానికి వచ్చాను. గ్రామ ప్రజలు అందరకూ కలిసి గ్రామాన్ని శుభ్రం చేసుకుంటే ఎటువంటి జ్వరాలు రావు. ఇబ్రహింపూర్ గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం చెత్తను శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభించాం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఒక్కరికి కూడా జ్వరం రాలేదన్నారు. సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లు వచ్చి మన ఇంటిని శుభ్రం చేయరు మనమే శుభ్రం చేసుకోవాలన్నారు. మళ్లీ ఈ గ్రామానికి 25వ తేదిన వస్తా..గ్రామాన్ని శుభ్రం చేసినట్లయితే ఇంటింటికి రెండు తులసి, వేప మొక్కలు ఇస్తామని చెప్పారు. ప్రజలు ప్లాసిక్ బ్యాగులను నిషేంధించి..జూట్‌ బ్యాగ్ లు వాడాలన్నారు.

Harish Rao New