గ్రామాల రూపురేఖలు మార్చాలన్నదే ప్రల్లె ప్రగతి లక్ష్యం

477
harish rao
- Advertisement -

గ్రామాల రూపురేఖలు మార్చడం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి హరీశ్ రావు, MLA సోలిపేట రామలింగారెడ్డి, ZP ఛైర్మెన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ,బక్కి వెంకటయ్య,DPO సురేష్ పలువురు హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామం శుభ్రంగా ఉండడం కోసం ధర్మారం లో మోడల్ గొర్రెల హాస్టల్ నిర్మిస్తాం. తడిచెత్త.. పొడిచెత్త సేకరణ కు ట్రాలీ లను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారం ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుంది. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

గ్రామాల రూపురేఖలు మార్చాలన్నదే సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమ ఉద్దేశ్యం. ప్రతి ఇంట్లో చెత్తను జమచేసిన పెడుతున్నాం..మనకు తెలియకుండానే దరిద్రాన్ని దాచుకుంటున్నాం. గ్రామాల్లో ప్రతి శుక్రవారం శ్రమదానం నిర్వహించాలి. ధర్మారం గ్రామానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. గ్రామస్తులంతా పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.

- Advertisement -