రైతులకు ఇబ్బంది లేకుండా ధ్యానం కొనుగోళ్లు..

225
- Advertisement -

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయిలో వరి కొనుగోళ్ల కేంద్రం ప్రారంభం,వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 రూపాయల నగదును అందజేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. అలాగే పాలమాకులలో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు, ఆరేపల్లిలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రం, గట్ల మల్యాల గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను మంత్రి హరీశ్ రావు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ : రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. కష్టకాలంలో కూడా రైతుబంధు డబ్బులు అందించాం. ఈ కరోనా విపత్కర కాలంలో కూడా రైతులకు మద్దత్తు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోళ్లు జరువుతున్నది. జిల్లాలో గతేడాది రబీలో 60వేల 370 ఎకరాల్లో వరి సాగు ఉంటే.. ఈ యేడాది లక్షా 52 వేల ఎకరాల్లో.. రెట్టింపు వరి సాగు వచ్చింది. రెట్టింపు వరి సాగు వచ్చినా 3 లక్షల 16 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం వచ్చినా ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామ గ్రామాన కొనుగోళ్ల కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల 700 వరి కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైంది. 1835 రూపాయల మద్దత్తు ధర ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, చాలా రాష్ట్రాల్లో కేవలం 10, 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేస్తామని సీలింగ్ పెట్టినప్పటికీ., తెలంగాణలో మాత్రం మొత్తం పంటను కొనుగోళ్లు చేస్తున్నాం. చివరి గింజ వరకూ కోని, రైతులకు మద్దత్తు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టామన్నారు.

జిల్లాలో లక్షా 52 వేల ఎకరాల్లో 3 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. అదే విధంగా జిల్లాలో మొక్కజొన్న 18వేల ఎకరాల్లో పండిందని, 4 లక్షల 29 వేల 880 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోళ్లు చేసేందుకు కేంద్రాలను ప్రారంభం చేశాం. ఇవాళ ఆరేపల్లి, గట్లమల్యాలలో మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభం చేశాం. ముండ్రాయి, పాలమాకుల, అక్కేన్న పల్లి, గట్ల మల్యాలలో వరి కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం చేశామని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో చాలా చోట్ల పొద్దు తిరుగుడు పండించారు. పొద్దు తిరుగుడు రైతులు నష్టపోకుండా వారికి 5650 మద్దత్తు ధర అందిస్తున్నట్లు, జిల్లాలో 20 వేల క్వింటాళ్లు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండిందని అధికారిక లెక్కల ప్రకారం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోళ్ల కేంద్రం ఏర్పాటు చేసినట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.జిల్లా వ్యాప్తంగా శనగ రైతులకు శనగల కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4870 రూపాయల మద్దత్తు ధర శనగకు అందిస్తున్నట్లు, జిల్లాలో 58 వేల క్వింటాళ్ల శనగ పంట పండుతున్నదని మంత్రి వెల్లడించారు.

- Advertisement -