వికలాంగులు ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్ళాలి

584
Harish Rao
- Advertisement -

వికలాంగులు ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్ళాలి అన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ఎస్ ఎస్ గార్జెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వికలాంగులుగా పుట్టడం నేరం కాదు…వికలాంగులను చిన్న చూపు చూసే వారిదే నేరం అని అన్నారు. వికలాంగులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత నిస్తుంది. వికలాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

వికలాంగులకు 3 వేల పెన్షన్,ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్,డబుల్ బెడ్రూం ఇండ్లలో 5 శాతం రిజర్వేషన్,8 వందల కోట్ల ప్రత్యేక బడ్జెట్, జిల్లా స్థాయిలో ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంమని చెప్పారు. సిద్ధిపేట, మెదక్,సంగారెడ్డి జిల్లాల్లో బ్యాక్ లాగ్ వికలాంగుల పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. సిద్ధిపేట ప్రాంతం లో ఏర్పడబోయే పరిశ్రమల్లో అవసరమైన చోట వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ZP ఛైర్మెన్ రోజాశర్మ,జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పులువురు వికలాంగుల సంఘం నేతలు హాజరయ్యారు.

- Advertisement -