పల్లె ప్రగతి కార్యక్రమంతో సర్పంచ్ లకు మంచి పేరు

486
harishrao
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో 90శాతం మంది సర్పంచ్ లకు మంచి పేరు వచ్చిందన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం అవగాహన సదస్సులో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పల్లె ప్రగతి కార్యక్రమం తో సర్పంచ్ ల గౌరవం పెరిగింది. ప్రజల్లో ప్రేమ,అభిమానం ,ఆప్యాయత పొందిన వారే నిజమైన అదృష్టవంతుడు, ఐశ్వర్య వంతుడని అన్నారు. పల్లె పగ్రతి కార్యక్రమం వల్ల గ్రామాల రూపురేఖలు మారాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పల్లెకు వచ్చిన వారు ఆశ్చర్యం కలిగేలా పల్లెల్లో మార్పు వచ్చింది.

పంచాయితీ సెక్రెటరీ నుండి కలెక్టర్ వరకు.. వార్డు మెంబెర్ నుండి జడ్పి చైర్మన్ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. సంగారెడ్డి జిల్లా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచింది.. మన ఊరు అనే కార్యక్రమంలో భాగంగా 4కోట్ల 90 లక్షల విరాళాలు సేకరించారు. ఏఒక్క గ్రామంలో చెత్త కనపడకుండా చేయడమే ఈ రెండవ విడత పల్లె ప్రగతి ప్రధాన అంశం అని అన్నారు. మెటీరియల్ కాంపోడ్స్ కింద సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు విడుదల చేసారు. ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ లు, స్మశాన వాటికలు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -