సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలుః మంత్రి గంగుల

275
Gangula-Kamalakar
- Advertisement -

తనను నమ్మి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. బిసి కమిషన్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి గా నేడు బాధ్యతలు స్వీకరించారు గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి హరీష్ రావు పాల్గొని గంగుల కమలాకర్ కు శుభాకాంక్షాలు తెలిపారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు శాఖల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవచేసే అవకాశం సీఎం కేసీఆర్ నాకు కల్పించారన్నారు. ముఖ్యమంత్రి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ముఖ్యమంత్రి కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకువచ్చి రైతులకు అండగా నిలిచారు. ఖరీఫ్ లో ధాన్యం పెరిగే అవకాశం ఉంది కావున..రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క బియ్యం గింజను కూడా బ్లాక్ లో తరలించకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పేద బిడ్డ చదువుకోవాలని గురుకులాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.

- Advertisement -