విలీనంపై మేనిఫెస్టోలో పెట్టలేదుః మంత్రి గంగుల

432
gangula kamalakar
- Advertisement -

ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూసారన్నారు. ఎక్కడ టెంట్ కనపడితే అక్కడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉడుముల్లా వాళుతున్నారు. యూనియన్ నాయకుల వెనుక రాజకీయ పార్టీలున్నాయని చెప్పారు. ఆర్టీసీపై ఏపీతో పొల్చడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. నాయకుల స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నారు.

ఐ.ఆర్, ఫిట్ మెంట్ రూపంలో ఇప్పటికే 60 శాతం సీఎం ఇచ్చారు. అశ్వత్థామ రెడ్డి వెనక ఏ పార్టీ ఉందో తెలుసుకోవాలి.మిమ్మల్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధిపొందాలనుకునే నేతల కుట్రలు గమనించాలని కార్మికులకు విజ్నప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణాను సీఎం నడిపించారు. పండుగను అడ్డం పెట్టుకుని యూనియన్ నాయకులు బ్లాక్ మెయిల్ చేశారు. రాజకీయ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 17 జూన్, 2016లో ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయబోమని కార్మికులతో సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

- Advertisement -