క్వారేంటైన్‌ మార్గదర్శకాలపై మంత్రి ఈటల సమీక్ష..

292
Minister Etela
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్న విదేశీయులు ఇకమీదట కేవలం 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ ఉంటే చాలు అని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. మరో ఏడు రోజుల పాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించింది.

అంతే కాకుండా విదేశాలనుండి వచ్చే వారిలో గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడేవారు, కుటుంబ సభ్యులు చనిపోయినవారు వస్తే వారిని నేరుగా హోమ్ క్వారెంటైన్‌కి తరలించవచ్చు అని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థన మేరకు మార్పులు చేసినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కి రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా వివిధ రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి డొమెస్టిక్ ఫ్లైట్స్ ద్వారా, ట్రైన్స్ ద్వారా రోడ్డు మార్గం ద్వారా వస్తున్న వారికి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కి తరలిస్తారు. లేనివారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చని అయితే స్వీయ రక్షణ పాటించాలి అని కోరారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ హెల్ప్ లైన్ 104,108 లకు సంప్రదించాలని కోరారు.

వీటన్నిటినీ మన రాష్ట్రంలో అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. హోమ్ క్వారేంటెన్‌లో ఉండే ప్రతి ఒక్కరినీ పరిశీలనలో ఉంచాలని కోరారు. ఎవరికి లక్షణాలు కనిపించినా హాస్పిటల్ కి తరలించి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రయాణీకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డాక్టర్స్ సూచించిన యాప్ డౌన్ లోడ్ చేసుకొని వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -