చదువు ఒక్కటే కాదు అన్నింటిలో ముందు ఉండాలి

360
etela
- Advertisement -

చదువు ఒక్కటే కాకుండా అన్నీ రంగాల్లో ముందుండాలి అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్. రవీంద్రభారతిలో అఖిల భారత సగర మహాసభ, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సగర ఉత్తమ విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజెందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉత్తమ విద్యార్థులకు మంత్రి పురస్కారాలు అందజేశారు.

ఈసందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. అవార్డ్స్ అందుకున్న విద్యార్దులకు శుభాకాంక్షాలు. మీ సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మీరు గొప్పగా వ్యవహరించారు. చెరువులు నిర్మించి నీళ్లు అందించిన జాతి మీది అన్నారు. కాంట్రాక్టర్లుగా కూడా మీ జాతి నుంచి ప్రోత్సాహించాలి అన్నారు. సగర జాతికి భవన నిర్మాణం కు ప్రభుత్వం హైదరాబాద్ లో స్ధలాన్ని కేటాయించినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మీకు ఆర్ధిక పరమైన పథకం అమలు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పేదలకు ఇబ్బంది లేని విధంగా వైద్యం అందిస్తామన్నారు.

Minister Etela Rajendar Attend Sagara Caste Awards Function At Ravindra Bharathi

- Advertisement -