మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..

313
minister errabelli
- Advertisement -

పాలకుర్తిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శివరాత్రి జాతర పండుగ పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి జాతరను విజయవంతం చేయాలన్నారు. పాలకుర్తిలో ప్లాస్టిక్ ని నిషేధించండి..ప్లాస్టిక్ అమ్మిన షాష్‌లను సీజ్ చేయాలన్నారు.

మేడారం జాతరను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని… అలాగే శివరాత్రి జాతరను విజయవంతం చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలని….చెత్త కుండీలను ఏర్పాటుచేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు పని చేయాలన్నారు.

- Advertisement -