కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష..

73
Minister Errabelli Dayakar Rao

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ ఆదేశాల ప్రకారమే ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.డీఎంకే తరహాలో పార్టీ నిర్మాణం చేయాలి.

కార్యకర్తల ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలమని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వం పెట్టె ఖర్చు ను కాంగ్రెస్ తప్పుపట్టడం దురదృష్టకరం.సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్పష్టం చేశారు.

ఇక ఇటీవల హన్మకొండలో జరిగిన ఘటనలో చిన్నారి మృతి పట్ల మేము అంత ఖండిస్తున్నాం అన్నారు. ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.చిన్నారి హత్య విషయంలో కాంగ్రెస్,బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. చిన్నారి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు. ప్రత్యేక చట్టం తీసుకరావాలనే ఆలోచనతో ఉన్నారు. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.